బరువు తగ్గడానికి(weight loss) చాలా కష్టాలు పడుతుంటాం. రాత్రి పూట టిఫెన్ చేయడం, రాత్రి పూట భోజనం మానివేయడం వంటివి చేస్తుంటాం.
సబ్జా గింజలు (chia seeds) బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. రెండు స్పూన్లు సబ్జా గింజలు తీసుకుని ఒక సగం గ్లాస్ నీటిలో 30 నిముషాలు నానబెట్టాలి.
ఒక గ్లాస్ నీరు తీసుకుని గోరువెచ్చగా అయ్యేవరకు వేడి చేయాలి. అందులో సగం నిమ్మకాయను పిండి, ముందుగా నానపెట్టినటువంటి సబ్జా గింజలు వేసి కలపాలి.
ఈ మిశ్రమం లో ఒక స్పూన్ తేనె వేసి కలపాలి. ఈ నీటిని ఉదయాన్నే(పరగడుపున) తీసుకుంటే బరువు తగ్గుతారు.