నిమ్మ రసంలో ఉన్నటువంటి కొన్ని సహజ లక్షణాల కారణంగా చర్మ సంబంధిత సమస్యలకు చికిత్స కోసం నిమ్మరసం ఒక ఔషధంగా వాడుతున్నారు. సహజంగా నిమ్మరసం బ్లీచ్ లక్షణాలను కలిగి ఉంటుంది .ఇది చర్మంపై ఉన్న టాన్ ను తొలగించడంలో సహాయపడుతుంది.

తాజా నిమ్మరసం తీసుకొని దానికి కొంచెం తేనెను కలిపి ముఖంపై రాయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై రాసుకుని 30 నిముషాలు ఉంచి తరువాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీ ముఖం పైన ఉన్న టాన్ తొలగిపోతుంది అంతే కాకుండా మీ చర్మం తెల్లబడటంలో సహాయపడుతుంది.