మనం తరుచూ ఎదుర్కొనే సమస్యలలో జుట్టు రాలిపోవడం ఒకటి. చిన్న పెద్ద అనే బేధం లేకుండా ఈ సమస్య అందరిలో కనిపిస్తుంది. ప్రస్తుత కాలుష్యం దీనికి మొదటి కారణం.
మెరిసే అందమైన జుట్టు కోసం చిట్కా :
కావలిసిన పదార్ధాలు:
కరివేపాకు -3 రెమ్మలు
నిమ్మకాయ- 1/2
చక్కెర -1 స్పూన్
కలబంద-1
షాంపూ -1 పాకెట్
ముందుగా రెండు లేదా మూడు కరివేపాకు రెమ్మలను తీసుకోవాలి. కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ లో వేయాలి. అందులో సగం నిమ్మకాయ, ఒక స్పూన్ చక్కెర వేయాలి.
ఈ మిశ్రమం లో ఒక పెద్ద కలబంద ను తీసుకుని అందులో ఉండే జెల్ వేయాలి. దీనితో బాటు మీరు రోజు వాడే షాంపూ వేసి మిక్సీ వేయాలి.
ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి క్రమం తప్పకుండా చేయడం వలన అందమైన జుట్టు మీ సొంతం.ఇలా చేయడం వలన మీ జుట్టు ఒత్తుగా ,అందంగా తయారవుతుంది .
చక్కెర కొత్త జుట్టు రావడానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇది మృతకణాలను నాశనం చేస్తుంది. అలాగే తలలో ఉండే మురికిని తీసివేస్తుంది.