సాధారణంగా అబ్బాయిలు, అమ్మాయిలు జుట్టు మృదువుగా ఉండటం కోసం మార్కెట్ లో రకరకాల కండిషనర్లు వాడుతుంటారు .కానీ రిసల్ట్ మాత్రం ఉండదు . ఈ రెండు చిట్కాలు పాటించడం వలన మీ జుట్టు ఒత్తుగా,మృదువుగా ఉంటుంది . ఇవి మీరు ముందు వాడి కూడా ఉండరు.మీరు చూడటానికి కొత్తగా ఉన్న , ఈ చిట్కాలు మీకు మాత్రం ఎంతో ఉపయోగపడతాయి .
బెల్లంతో మృదువైన జుట్టు మీ సొంతం ( Hair Tip with jaggery/bellam)
చిట్కా 1:
కావలసిన పదార్ధాలు :
నీరు -2 లీటర్లు
బెల్లం -100 గ్రాములు
తయారీ విధానం :
ముందుగా బెల్లాన్ని మెత్తగా పొడిలా చేసుకోవాలి . 2 లీటర్ల నీటిలో బెల్లాన్ని కలిపి పానకంలా చేసుకోవాలి.ఈ పానకాన్ని తల స్నానం చేసిన తరువాత , తలకు పట్టించి 10 నిముషాలు ఉంచాలి.తరువాత చల్లని నీటితో కడగాలి .ఇలా వారానికి ఒకసారి చేయడంవలన మీ జుట్టు మృదువుగా అవుతుంది .
చిట్కా 2:
అలోవెరా తో అందమైన మెరిసే జుట్టు ( Hair Tips with Aloe Vera)
కావలసిన పదార్ధాలు :
అలోవెరా (కలబంద ) జెల్-4 స్పూన్లు
నిమ్మరసం : 2 స్పూన్లు
ముందుగా 4-5 స్పూన్ల కలబంద గుజ్జుని తీసుకుని, అందులో 2 స్పూన్లు నిమ్మరసం వేసి బాగా కలపాలి .ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి , 10 నిముషాల తరువాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి . ఈ చిట్కా పాటించినట్లయితే మృదువైన జుట్టు మీ సొంతం . కలబందలో ఉండే ఖనిజాలు, జుట్టును బలంగా, పొడవుగా, మందగా చేస్తాయి.