మనం ఎంత జాగ్రత్త వహించిన పాదాలు మాత్రం శుభ్రంగా ఉన్నట్లు అనిపించవు . పాదాలపై ఉన్న చర్మం నల్లగా, ముడతలు ఉన్నట్లు అనిపిస్తుంది. మనం పడవేసే పండ్ల తొక్కలను ఉపయోగించి పాదాలపై మురికిని తొలగించవచ్చు. ఆ చిట్కా ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్ధాలు :
కమలా పండు తొక్కలు(Orange peel ) – 5-10
నిమ్మకాయ -1/2 వంటసోడా-1/2 స్పూన్
సాల్ట్- కొద్దిగా
షాంపూ -1/2 ప్యాకెట్
కొబ్బరినూనె-1 స్పూన్
ముందుగా ఒక గిన్నెలో నీరుపోసి అందులో కమలా పండు తొక్కలు, సగం నిమ్మకాయ తీసుకుని ఆ రసాన్ని ఆ నీటిలో పిండి మిగిలిన నిమ్మచెక్కను ఆ నీటిలో వేసి 2 నిముషాలు మరిగించాలి. ఇపుడు ఆ నీటిని ఒక బకెట్ లో పోసి కొద్దిగా షాంపూ, కొంచెం ఉప్పు, వంటసోడా వేసి బాగా కలపాలి.
ఆ నీటిలో పాదాలను పెట్టి 5 నిముషాలు ఉంచి, బాగా రుద్దాలి.తరువాత కాళ్ళను శుభ్రంగా తుడిచి కొద్దిగా కొబ్బరినూనెను పూయాలి. ఈ చిట్కాను పాటిస్తే మీ పాదాల పగుళ్ళు కూడా తగ్గిపోతాయి.