కంటి కింద నల్లని వలయాలు ఏర్పడటం ఇప్పుడు సాధారణం అయ్యింది . ఎక్కువ సేపు మొబైల్ చూడటం, సరిపోయినంత నిద్ర లేకపోవడం ,ఆఫీస్ పనుల వలన గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్ వంటి కారణంగా కంటికింద నల్లటి వలయాలు ఏర్పాడతాయి .
ఆయుర్వేద గుణాలు ఉండే అలోవెరాతో మనకు బోలెడు లాభాలు ఉన్నాయి . అలోవెరా (కలబంద ) గుజ్జును శరీర ఆరోగ్యానికి , చర్మ సౌందర్యానికి((Aloe Vera for Face) మరియు కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలొవెరాను చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి నివారిణిగా ఉపయోగిస్తారు.
కొన్ని సులభమైన చిట్కాల ద్వారా డార్క్ సర్కిల్స్ ( Tip to Remove dark circles under eyes)నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఆ చిట్కాలు ఇప్పుడు చూద్దాం .
టిప్ :
ముందుగా 2 స్పూన్ల కలబంద గుజ్జుని తీసుకొని , అందులో ఒక విటమిన్ E టాబ్లెట్, చిటికెడు పసుపు వేసి కలపాలి . ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గాజు సీసాలో భద్రపరచుకొని రోజు రాత్రి కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలపై మసాజ్ లాగా చేసుకుని, 30 నిముషాల తరువాత తుడిచివేయాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన నల్లటి వలయాలు(Dark circles ) సమస్య నుండి విముక్తి పొందవచ్చు .