HomeDevotionalThulasi Mala - తులసి మాల లేదా ధాత్రి మాల (ఉసిరి) విశిష్ఠత

Thulasi Mala – తులసి మాల లేదా ధాత్రి మాల (ఉసిరి) విశిష్ఠత

హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి మహిళలు తులసిని ఆరాధిస్తారు మరియు ఈ విధంగా, తులసి దండ ధరించడం మంచిదిగా భావిస్తారు. విష్ణు, కృష్ణ భక్తులు తులసి దండ ధరిస్తే గొప్ప ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. తులసి దండ ధరించడం వల్ల మనస్సు, ఆత్మ స్వచ్ఛంగా మారుతాయని నమ్మకం.

కార్తిక మాసమున నెల రోజులు తులసి మాలను లేదా ధాత్రి(ఉసిరి) మాలను తప్పక ధరించవలెను.

నివేద్య కేశవే మాలాన్‌ తులసీ కాష్ట సంభవామ్‌ వహతే యోనరో భక్త్యా తస్యవై నాస్తి పాతకమ్‌
నజహ్యత్‌ తులసీ మాలామ్‌ ధాత్రీ మాలామ్‌ విశేషత:
మహా పాతక సంహర్తీ ధర్మ కామార్ధ దాయనీ
స్పృశేత్తు యాని రోమానీ ధాత్రీ మాలా కలౌనృణామ్‌
తావత్‌ వర్ష సహస్రాణి వైకుంఠే వసతి: భవేత్‌

Thulasi Malaఈ మంత్రము స్కాంద పురాణమున ద్వారకా మహాత్యం ద్వారా తెలుస్తోంది. శ్రీమన్నారాయణునికి తులసి మాలను లేదా ధాత్రి మాలను సమర్పించి కార్తికమాసమంతా ఏనాడూ విడువక భక్తితో మాలను ధరించాలి.

ఈ రెండు మాలలు మహాపాతకములను నశింపజేసి ధర్మార్థకామములను ప్రసాదించును. ఈ మాలలు హృదయ భాగమున ఎన్ని రోమములను స్పృశించునో అన్ని వేల సంవత్సరములు వైకుంఠములో అలాగే కోరుకున్నచో కోటి కల్పములు స్వర్గమున నివాసముండవచ్చును.

తులసీ కాష్ట సంభూతే మాలే కృష్ణ జన ప్రియే బిభర్మి త్వామహమ్‌ కంఠె కురుమామ్‌ కృష్ణ వల్లభమ్‌

అను మంత్రముతో తులసిమాలను ధరించవలెను.

తులసీ దళ లక్షేణ కార్తికే యోర్చయేత్‌ హరిమ్‌|
పత్రే పత్రే ముని శ్రేష్ట మౌక్తికం లభతే ఫలం||

కార్తికమాసంలో కేశవునికి లక్ష తులసి అర్చన చేసినచో ప్రతి తులసి పత్రముతో ముక్తి లభించును.

See also  Aakasa Deepam: కార్తీక మాసంలో ఆకాశ దీపం ప్రాముఖ్యత ఏమిటి ?
RELATED ARTICLES

Most Popular

Recent Comments