మనం నిత్యం ఉపయోగించే పేస్ ప్యాక్ లలో శనగపిండి (Senaga pindi)ఒకటి. శనగపిండి ముఖాన్ని కాంతివంతంగా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పిండి మచ్చలు, మొటిమలను నివారిస్తుంది.శతాబ్దాలుగా భారతదేశంలో చర్మ సౌందర్యానికి శనగపిండిని ఉపయోగించేవారు.
ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఎంతో సహాయపడుతుంది. శనగపిండి పేస్ ప్యాక్ లా చేసుకుని ముఖానికి పట్టిస్తే ముఖం బాగా మెరిసిపోతుంది.
శనగపిండి పేస్ ప్యాక్ ( Senaga pindi face pack):
కావాల్సిన పదార్ధాలు
శెనగపిండి – 2 టీ స్పూన్లు
పసుపు – చిటికెడు
పాలు – సరిపడ
శనగపిండిలో కొద్దిగా పసుపు వేసి దీనికి కొద్దిగా పాలు కలిపి పేస్ట్ వచ్చే లాగా చేసుకోండి.వచ్చిన మిశ్రమాన్ని మీ మొహానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి.10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.మీ వారానికి రెండుసార్లు ఇలా చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పసుపు లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వల్ల ఇది మీ చర్మంపై వచ్చే మొటిమలు తగ్గిస్తుంది. మీ చర్మానికి కావాల్సిన తేమను అందించి ప్రకాశవంతంగా చేస్తుంది.
శనగపిండి మరియు టమోటా ఫేస్ ప్యాక్:
కావలసిన పదార్ధాలు
శెనగపిండి – 2 టీ స్పూన్లు
టమోటా-1
టమోటా రసాన్ని తీసుకుని దానిలో శనగపిండిని వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి .దీనిని మీ మొహానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకోండి. ఈ ప్యాక్ ను 10-12 నిమిషాల తరువాత కడగాలి.వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేయడం వలన మంచి ఫలితం లభిస్తుంది.
శెనగపిండి కి టొమాటో గుజ్జును జోడించడం వల్ల చర్మం మెరుపు పెంచే ఫేస్ ప్యాక్ అవుతుంది. టమోటాలో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ అనే ఆమ్లం మీ చర్మంపై ఉండే నల్లని మచ్చలు ఇట్టే తగ్గిస్తుంది. అలాగే చర్మం సున్నితంగా చేసి చర్మంపై ఉండే ముడతలను తగ్గిస్తుంది.