జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.వీటిలో అధిక శాతం ఫైబర్, మెగ్నీషియం. క్యాల్షియం, ఐరన్ మరియు ఇతర పోషక పదార్ధాలు కూడా ఉంటాయి.మన పెద్దలు వీటిని వారి రోజువారీ ఆహారంలో తీసుకునేవారు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ సేపు కూడా కష్టపడే సామర్ధ్యాన్ని కలిగి ఉండేవారు . అటువంటి జొన్నలతో ఒక వంటను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జొన్న ఇడ్లీ తయారు చేయు విధానం( Preparation of Jowar/Jonna Idly)
కావలసిన పదార్ధాలు :
జొన్నలు – 1 కప్పు
మినుములు -1/2 కప్పు
మెంతులు -1 టేబుల్ స్పూన్
ముందుగా జొన్నలు,మినుములు , మెంతులు తీసుకుని ఒక గిన్నెలో పోసి శుభ్రంగా కడగాలి . వీటిలో కొంత నీరు పోసి కనీసం 6 గంటలు నానబెట్టాలి . ఈ విధంగా నానపెట్టిన జొన్నలను, మినుమలను మెత్తగా పేస్ట్ చేయాలి . ఈ మిశ్రమాన్ని 5 గంటలు అలాగే ఉందని ఉంచాలి .
పొయ్యి మీద కాలాయి పెట్టి కొద్దిగా నూనె వేసి , అది వేడి అయ్యాక కొద్దిగా పోపుదినుసులను వేయాలి . అలాగె కొంచెం అల్లం ముక్కలు, కొద్దిగా మిర్చివేసి తాళింపు పెట్టాలి .
ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసుకున్న పిండిలో కలపాలి.ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము, కొంచెం ఉల్లిపాయ ముక్కలు , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
స్టవ్ పైన ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నీరుపోసి ఉంచాలి . ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్ లో వేసి ఉడికించాలి .
ఈ విధంగా తయారు చేసిన ఇడ్లీ షుగర్ పేషెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది . పిల్లలకు ఎంతో బలవర్ధకమైన ఆహరం.