మగువలు తమ ముఖం పై ఎంత శ్రద్ధ తీసుకుంటారో , అలాగే తమ జుట్టు రాలిపోకుండా ఉండేందుకు అంతే శ్రద్ధ వహిస్తారు. అందమైన శిరోజాలు మగువలకు ఎంతో అందం. జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ఈ చిన్న చిట్కా పాటించి చుడండి.
కావలసిన పదార్ధాలు :
ఉల్లిపాయ-1
కరివేపాకు- 2 -3 రెమ్మలు
కొబ్బరి నూనె-1 కప్పు
ముందుగా ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తురిమి ,అందులో కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక బాణలి తీసికొని అందులో కొబ్బరి నూనె వేడి కాగానే , మెత్తగా చేసుకున్న పేస్ట్ ను వేసి 5-10 నిముషాలు వేడి చేయాలి. నూనె చల్లారిన తరువాత బాటిల్లోకి నూనె తీసుకుని నిల్వ చేసుకోవాలి.
ఈ నూనెను క్రమం తప్పకుండా రాసుకోవడం వలన మీ జుట్టు రాలే సమస్యనుండి విముక్తి పొందవచ్చు .ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.కరివేపాకు జుట్టు నల్లగా మారడానికి ఉపయోగపడుతుంది