HomeDevotionalNavagraha Shlokam - గ్రహ దోషాలు పోవాలంటే నిత్యం 'నవగ్రహ శ్లోకం' చదవండి

Navagraha Shlokam – గ్రహ దోషాలు పోవాలంటే నిత్యం ‘నవగ్రహ శ్లోకం’ చదవండి

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ.. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ నవగ్రహ శ్లోకం నిత్యం పఠించడం మంచిదే. అయితే నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము.

గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం చదవాల్సిన శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

ఫలితం : సూర్యుడిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

చంద్రుడు 
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||

ఫలితం : చంద్రుడిని ఆరాధిస్తే మనోధైర్యం పెరుగుతుంది.

కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||

ఫలితం : కుజ గ్రహం శరీరంలో మలినం, విష పదార్థాలు తొలగిస్తుంది.

బుధుడు 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

ఫలితం : బుధ గ్రహాన్ని ఆరాధిస్తే చక్కటి విద్య వస్తుంది.

గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

ఫలితం : గురుగ్రహాన్ని సేవిస్తే శుభాలే వింటారు.

శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

ఫలితం : శుక్రుడిని ఆరాధిస్తే సుఖసంతోషాలతో ఉంటారు.

శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||

ఫలితం : శనిని పూజిస్తే దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉంటారు.

రాహు 
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||

ఫలితం : రాహుగ్రహాన్ని ఆరాధిస్తే తక్షణమే అనారోగ్యం తొలగిపోతుంది.

కేతు 
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||

ఫలితం : కేతువుని సేవిస్తే సంపదలు, సౌఖ్యాలు లభిస్తాయి.

నవగ్రహాల ఆరాధన వల్ల మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు అని పండితులు చెప్తున్నారు. ప్రతి నిత్యం నవగ్రహ శ్లోకం లేదా మీ గ్రహస్థితిని బట్టి ఆ శ్లోకం చదువుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని పండితులు చెప్తున్నారు.

See also  దసరా నవరాత్రులలో 'శ్రీ మహాలక్ష్మీ దేవి' గా అమ్మవారు, మంత్రం, నైవేద్యం
RELATED ARTICLES

Most Popular

Recent Comments