వేదాల ప్రకారం సవిత గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి.
నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం. “న గాయత్య్రాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్” అంటే తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదని అర్థం.
గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలో తొలుత వివరించారు. గాయత్రి అనే పదం గయ త్రాయతి అను పదాలతో కూడుకుని ఉంది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ అని ఆదిశంకరాచార్యులు తన భాష్యంలో వివరించారు.
గాయత్రి మంత్రం ( Gayatri Mantram)
‘ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్’
గాయత్రి మంత్రాన్ని అందరూ జపించవచ్చు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి.
అంతేకాదు మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి పలువులు ప్రయత్నాలు కూడా చేశారు. దీని వల్ల మెదడులోనూ ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయి.
వేదాల ప్రకారం సవిత గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. అగ్ని ముఖం, రుషి విశ్వామిత్రుడు .. గాయత్రీ ఛందం. ప్రణవ రూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య తేజమైన సవితను ఉపాసిస్తున్నాను అనేది ఈ మంత్రానికి ఉన్న అర్థాలలో ఒకటి.
అనేక విధాలుగా గాయత్రి స్తోత్రం చేస్తారు. వీటిలో నవగ్రహ గాయత్రి కూడా ఒకటి. ఈ మంత్రం జపించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగి శుభం జరుగుతుందని పండితులు చెబుతారు.
నవగ్రహ గాయత్రి మంత్రం (Navagraha Gayatri Mantram)
1. సూర్య గాయత్రి (Surya Gayatri Mantram)
ఓం భాస్కరాయ విద్మహే
మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్
2. చంద్ర గాయత్రి (Chandra Gayatri Mantram)
ఓం అమృతేశాయ విద్మహే
రాత్రిన్చరాయ ధీమహి
తన్నశ్చంద్రః ప్రచోదయాత్.
3. కుజ గాయత్రి (Kuja Gayatri Mantram)
ఓం అంగారకాయ విద్మహే
శక్తి హస్తాయ ధీమహి
తన్న: కుజః ప్రచోదయాత్.
4. బుధ గాయత్రి (Budha Gayatri Mantram)
ఓం చంద్ర సుతాయ విద్మహే
సౌమ్య గ్రహాయ ధీమహి
తన్నో బుధః ప్రచోదయాత్.
5. గురు గాయత్రి (Guru Gayatri Mantram)
ఓం సురాచార్యాయ విద్మహే
దేవ పూజ్యాయ ధీమహి
తన్నో గురుః ప్రచోదయాత్
6. శుక్ర గాయత్రి (Sukra Gayatri Mantram)
ఓం భృగువాస జాతాయ విద్మహే
శ్వేతవాహనాయ ధీమహి
తన్నో శుక్రః ప్రచోదయాత్
7. శని గాయత్రి (Shani Gayatri Mantram)
ఓం రవిసుతాయ విద్మహే
మందగ్రహాయ ధీమహి
తన్నః శనిః ప్రచోదయాత్
8. రాహు గాయత్రి (Rahu Gayatri Mantram)
ఓం శీర్ష రూపాయ విద్మహే
వక్ర పందాయ ధీమహి
తన్నో రాహుః ప్రచోదయాత్
8. కేతు గాయత్రి (Kethu Gayatri Mantram)
ఓం తమోగ్రహాయ విద్మహే
ధ్వజస్థితాయ ధీమహి
తన్నో కేతుః ప్రచోదయాత్.