సూర్యుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యుని అనుగ్రహం కొరకు ఈ ద్వాదశ నామాలను సూర్యునికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉచ్చరించండి.
శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక.
ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.
సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.
ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
1.ఓం మిత్రాయ నమః Om Mitraya Namah।
2.ఓం రవయే నమః Om Ravaye Namah।
3.ఓం సూర్యాయ నమః Om Suryaya Namah।
4.ఓం భానవే నమః Om Bhanave Namah।
5.ఓం ఖగాయ నమః Om Khagaya Namah।
6.ఓం పూష్ణే నమః Om Pushne Namah।
7.ఓం హిరణ్య గర్భాయ నమః Om Hiranyagarbhaya Namah।
8.ఓం మరీచయే నమః Om Marichaye Namah।
9.ఓం ఆదిత్య యనమః Om Adityaya Namah।
10.ఓం సవిత్రే నమః Om Savitre Namah।
11.ఓం అర్కాయ నమః Om Arkaya Namah।
12.ఓం భాస్కరాయ నమః Om Bhaskaraya Namah।