HomeDevotionalలింగాష్టకం పరమశివుడి ప్రార్థనా స్తోత్రము (Lingashtakam in Telugu with Meaning)

లింగాష్టకం పరమశివుడి ప్రార్థనా స్తోత్రము (Lingashtakam in Telugu with Meaning)

  • లింగాష్టకం పరమశివుడి ప్రార్థనా స్తోత్రము.
  • లింగాష్టక స్తోత్రం హిందువులచే ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో ఒకటి.
  • లింగాష్టకం మొత్తం ఎనమిది చరణాలను కలిగి ఉంటుంది, ఇందులో ప్రతి చరణము పరమశివుడిని స్తుతిస్తూ వ్రాయబడి ఉంటుంది.
  • లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మరియు చెడు మరియు చెడ్డ అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు.
  • లింగాష్టక స్తోత్రాన్ని గొప్ప భక్తితో పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం.
  • లింగాష్టకం, లింగాష్టకం యొక్క తెలుగు అర్థం క్రింద ఇవ్వబడినది.

Lingashtakam

బ్రహ్మమురారిసురార్చిత లింగం 
నిర్మలభాసితశోభిత లింగమ్ |
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ ||

అర్థం – బ్రహ్మ విష్ణు దేవతలచే పూజింపబడే లింగం
నిర్మలమైన మాటలతో శోభించబడిన లింగం
జన్మ వల్ల పుట్టే దుఃఖాలను నాశనం చేసే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౧ ||

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్ |
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౨ ||

అర్థం – దేవమునులు ఋషులు పూజించే లింగం
కామాన్ని దహనం చేసి, కరుణను చూపే చేతులుగల లింగం
రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౨ ||

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౩ ||

అర్థం – అన్ని గంధాలు చక్కగా పూసిన లింగం
బుద్ధివికాసానికి కారణమైన లింగం
సిద్దులు దేవతలు రాక్షసులచే కీర్తింపబడే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[3]

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౪ ||

అర్థం – బంగారు మహామునులచే అలంకరింపబడే లింగం
నాగరాజు నివాసంచే అలంకరింపబడే లింగం
దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౪ ||

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ |
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౫ ||

అర్థం – కుంకుమ గంధము పూయబడిన లింగం
కాలువల హారంచే శోభించబడే లింగం
సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౫ ||

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౬ ||

See also  ప్రతిరోజు పఠించవలసిన శ్లోకములు

అర్థం – దేవగణాల చేత పూజింపబడే సేవించబడే లింగం
భావంచే కూడిన భక్తిచే పూజింపబడే లింగం
కోటి సూర్యుల కాంతిచే వెలిగిపోయే లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౬ ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ |
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౭ ||

అర్థం – ఎనమిది రకాల ఆకులపై నివసించే లింగం
అన్నీ సరిగ్గా ఉద్బవించాడని కారణమైన లింగం
అష్ట దారిద్య్రాలను నాశనం చేసి లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౭ ||

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం 
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౮ ||

అర్థం – దేవతల గురువు దేవతలు పూజించే లింగం
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం || ౮ ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

అర్థం – లింగాష్టకాన్ని శివుడి సన్నిధిలో చదివితే పుణ్యం వొస్తుంది
శివలోకం లభిస్తుంది శివుడిలో ఐక్యమవడానికి మార్గం దొరుకుతుంది

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments