బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. వ్యాయామం, కొవ్వు తక్కువ ఉండే ఆహరం తీసుకోవడం చేస్తుంటాం. బరువు తగ్గడానికి కొందరు డైట్లు, జిమ్ (gym)ల వంటివి చేస్తుంటారు.
బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటికన్నా సత్వర ఫలితం పొందాలంటే ఈ చిట్కా పాటించి చూడండి.
కావలసిన పదార్ధాలు :
ఎండిన తులసి ఆకు పౌడర్ -2 స్పూన్
లెమన్-1
నీరు -2 కప్పులు
ముందుగా నిమ్మకాయను కట్ చేసి అందులోనుండి రసం తీసివేయాలి.ఇప్పుడు ఒక గిన్నెలో నీరు పోసి అందులో నిమ్మకాయ ముక్కలు వేయాలి. అవి మరిగాక తులసి ఆకుపొడి వేసి10 నిముషాలు మరిగించాలి.
ఇలా మరగించడం వలన నిమ్మకాయ, తులసిలో ఉండే న్యూట్రియెంట్స్ నీటిలోకి చేరుతాయి.10 నిముషాలు తరువాత ఈ నీరు చల్లబడిన తరువాత ఒక గ్లాస్ లోకి వడకట్టి తీసుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడంవలన మీ బరువు తగ్గుతారు.