ప్రస్తుతం చిన్న ,పెద్ద అంటూ తారతమ్యం లేకుండా అందరు పేస్ చేస్తున్న సమస్య జుట్టు రాలడం, అతి చిన్న వయసులో జుట్టు తెల్లబడడం , తల మధ్య భాగంలో జుట్టు రాలిపోవడం. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి కొత్త చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం.
కలోంజీ ని ఉల్లిపాయ విత్తనాలు అని కూడా అంటారు. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసేందుకు, మరియు మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయి.
కావలసిన పదార్ధాలు :
మెంతులు (Fenugreek seeds)-2 స్పూన్లు
కలోంజీ (kalonji seeds)-3 స్పూన్లు
కరివేపాకు-2 రెమ్మలు
ముందుగా ఒక బాణలీ తీసుకొని అందులో కలోంజీ విత్తనాలు , మెంతులు వేసి 5 నిముషాలు వేయించి పక్కన పెట్టాలి. అందులో కరివేపాకు వేసి 2 నిముషాలు వేయించాలి. ఒక జార్ తీసుకుని అందులో వేయించిన కలోంజీ విత్తనాలు , మెంతులు , కరివేపాకు వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి.
అదే బాణలీలో ఒక కప్పు కొబ్బరినూనె ,1/2 కప్పు ఆముదం (castor oil )వేసి అందులో మెత్తగా పొడి చేసి పెట్టుకున్న పౌడర్ ను వేసి 10 నిముషాలు తక్కువ మంటలో ఉంచి వేడి చేయాలి. తరువాత ఒక గిన్నెలోకి వడకట్టాలి. ఈ నూనెను వారానికి 3 సార్లు రాసుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
- ఈ ఆయిల్ జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
- జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.
- జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు దోహదపడుతుంది.
- జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.