నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. ఆదివారం సప్తమి వచ్చిన రోజుని భానుసప్తమి అంటారు. ఈ రోజు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై మొదటిసారి కనిపించాడని నమ్ముతారు. విభిన్నమైన సప్తమిలలో, భాను సప్తమి చక్కని శుభప్రదాలను ప్రసాదిస్తుంది.
ఆదివారం సప్తమి వచ్చిన రోజుని భాను సప్తమి (Bhanu Sapthami) అంటారు. ఈ రోజు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై మొదటిసారి కనిపించాడని నమ్ముతారు. విభిన్నమైన సప్తమిలలో, భాను సప్తమి చక్కని శుభప్రదాలను ప్రసాదిస్తుంది.
రోజు సుర్యారాధనతో విద్యా, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది. సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతా ౹౹
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి ౹౹
మద్యం, మాంసం మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము, తైలం రాసుకోనుట, మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు,వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.
ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.
ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం.సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను, ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.
శ్రీ రామచంద్రుడు అంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు. ఇది అందరికీ తెలిసినదే. ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది.
సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ
సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నయోనమః
సనాతన ధర్మంలో పురాణేతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.ఎందుకంటే పూర్వకాలం నుంచి హిందువులంతా సూర్యోపాసకులే. అందుకే మన పండుగలన్నీ సౌరమానం అంటే సూర్యుడిని ఆధారంగా చేసుకునే నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఆదివారం పైగా సప్తమి తిథి వచ్చిన రోజు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెబుతారు.
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ ||
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ ||
అలాంటి మహిమ గల పవిత్రమైన ఈ భానుసప్తమి నాడు మనం కూడా సూర్య భగవానుడుని ప్రార్థన చేసి..
సూర్య స్తోత్రాలు పఠించి, ప్రత్యక్ష భగవంతుడైన సూర్య నారాయణుడి అనుగ్రహం పొందుదాం.
ఓం నమో ఆదిత్యాయ నమః 🙏
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః 🙏