HomeDevotionalAyudha Pooja ఆయుధ పూజ ప్రాముఖ్యత -ముహూర్తం, పఠించవలసిన మంత్రం.

Ayudha Pooja ఆయుధ పూజ ప్రాముఖ్యత -ముహూర్తం, పఠించవలసిన మంత్రం.

దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. దసరా పండుగకు ఒకరోజు ముందు వచ్చే పండుగే ఆయుధ పూజ. .ఆయుధ పూజ అంటే ఎవరి వృత్తికి కి సంబంధించిన వారి పనిముట్లను పూజించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ ఆచారాన్ని హిందువులలో చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.

ఈ పవిత్రమైన పర్వదినాన హిందువులలో చాలా మంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నింటినీ , ఇతర సామాగ్రిని దుర్గా మాత ముందు ఉంచి పూజలు చేస్తారు.

రైతులు అయితే కొడవలి , నాగలి , వాహనం ఉన్న వారు తమ వాహనాలకు , టైలర్లు తమ కుట్టు మిషన్లకు , చేనేత కార్మికులు మగ్గాలకు , ఫ్యాక్టరీలలో కార్మికులు తమ మిషన్లకు , ఇతర పనిముట్లకు పసుపు , కుంకుమతో అది వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు.

ఈ విధంగా వాహనాలకు, వ్యవసాయ పనిముట్ల కు, ఈ విధంగా ప్రతి రంగంలో పనిచేసేటటువంటి అన్నిరకాల యంత్రాలకి కూడా దశమి కి ముందు రోజు ఈ ఆయుధాలు పూజను నిర్వహిస్తారు.ఇలా చేయడం ద్వారా మనకి కూడా విజయం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

పాండవుల ఆయుధాలు..

పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అర్జునుడు గాండీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్లడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు.అలా వారు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని , పాండవులు యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు.

మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు.

పంచప్రకృతి మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. బవబంధాల్లో చిక్కుకున్న వ్యక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈరోజు స్మరించుకుంటే.. శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం.
ఆయుధ పూజ మంగళవారం , అక్టోబర్ 4 , 2022

ఆయుధ పూజ విజయ ముహూర్తం – 02:08 PM నుండి 02:55 PM
పఠించవలసిన మంత్రం

ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః‘ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలిత అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి.

See also  దసరా నవరాత్రులలో "శ్రీ మహా సరస్వతీ దేవి" గా అమ్మవారు
RELATED ARTICLES

Most Popular

Recent Comments