కొంతమంది మహిళలు అవాంఛిత రోమాల (వెంట్రుకలు)తో (Unwanted hair removal tip) ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి పై పెదవి పై ఉంటె మరి కొందరిలో గడ్డం క్రింద భాగాన కనిపిస్తాయి .ఇవి చూడటానికి మీసం వచ్చినట్టుగా నూనూగు మీసాలుగా కనిపిస్తూ అందవీనంగా ఉంటాయి.
ఈ వెంట్రుకలను చాలా మంది త్రెడ్డింగ్ వంటి ఆధునాత పద్దతులని ఉపయోగిస్తారు. వీటిని మనం తీసివేసిన తరువాత మరింత దళసరిగా నల్లగా కనిపిస్తాయి . ఇటువంటి అవాంఛిత రోమాలు రాకుండా ఉండేందుకు ఒక చిన్న చిట్కా చూద్దాం .
చిట్కా:1
కావలిసిన పదార్ధాలు :
పాలు (పచ్చి )- 5-6 స్పూన్లు
పసుపు – చిటికెడు
ఒక చిన్న గిన్నెలో పాలు తీసుకుని ,అందులో పసుపు వేసి వెంట్రుకలు ఉన్న చోట(పై పెదవి, గడ్డం క్రింది బాగాన) రాయాలి . ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన వెంటుకలు ఊడిపోతాయి .
పసుపు కూడా అవాంచిత రోమాలని నివారించడంలో ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. పచ్చి పాలలో ముఖంపై ఉండే మురికిని పోగొట్టడంలో ఎంతో ఉపయోగపడుతుంది . దీంతో మీ ముఖం ఎంతో అందంగా తయారు అవుతుంది .
చిట్కా 2:
పసుపు తీసుకుని అందులో కొంచం నీళ్ళు పోసి మెత్తగా అయిన తరువాత రోమాలు ఉన్న పెదవి పై అప్లై చేసి సుమారు 15 నిముషాలు పాటు ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి గనుక చేస్తే అవాంచిత రోమాలని సులువుగా తొలగించవచ్చు.