హిందువుల ఆచారానికి అర్థం ఉంటుంది వాళ్ళు జరుపుకునే ప్రతి పండుగకు ఒక కారణం ఉంటుంది. భోగి శుభాకాంక్షలు చెప్పేసుకుంటాం, భోగి పండుగ ఎలా పుట్టిందో తెలియదు.
ఇంద్రుడికి మరో పేరు భోగి
అన్నీ బోగభాగ్యాలు అనుభవిస్తుంటారు కనుక ఆయనకు ఆ పేరు మన పంట వరుణుడి సహకారంతో సంక్రాంతి రోజు మన ఇంటికి చేరుకుంటాయి అందుకు కారణం ఇంద్రుడు అంటారు.
వరుణదేవుడికి అధిపతి ఇంద్రుడు కనుక మనకు సకాలంలో వర్షాలు కురిపించే పండించే రైతన్నకు సహాయంగా ఉంటాడు కంకుకానీ ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ భోగీ చేసుకుంటారు.
కృష్ణయ్యను కష్టపెట్టాలని తలచి గట్టివర్షన్ని ఇస్తాడు అప్పుడు కృష్ణుడు గోవర్ధన గిరిని పైకి లేపి వర్షాన్ని ఆపేస్తాడు. అప్పుడు ఇంద్రుడి అహం విడనాడి బుద్ధి తెచ్చుకుంటాడు. అందుకే భోగి చేసుకుంటారని అంటారు.
ఆ రోజునే మంటల్లో ఇంద్రుడి అహాన్ని కాల్చేసి సకాలంలో వర్షాలు పడేలా చేయమని ఆయనను ప్రసన్నం చేసుకుంటారు.
అలాగే సంక్రాంతి పండుగ రోజు మహాలక్ష్మి ఇంటికి వస్తుంది అంతకంటే ముందు దరిద్రలక్ష్మిని బయటకు పంపేయాలి కనుక ముందు రోజు చెత్త అంత శుభ్రం చేసి మొత్తాన్ని మంటల్లో వేసి బూడిదను చేస్తాం.
అలా భోగి పండుగకు కొన్ని కథలు ఉన్నాయి.
భోగి మీ జీవితానికి వెలుగు పంచాలని వెలుగు తో పాటు మీ ఇంట సిరులు నింపలని సిరులతో మీ మనసు సంతోష పారవశ్యం కావలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.