Fennel Seeds : ఈ రోజుల్లో చాలా మంది మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజలు.. ఇవి మనందరికీ తెలిసినవే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఈ గింజలు చక్కటి రుచిని కలిగి ఉంటాయి. భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే వంటల తయారీలో, తీపి పదార్థాల తయారీలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. సోంపు గింజలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
సోంపు గింజలను తినడం వల్ల జీర్ణశక్తి పెరిగి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఈ గింజలను ఎంత ఎక్కువగా తింటే మనం అంత త్వరగా బరువు తగ్గుతామని వారు తెలియజేస్తున్నారు. అసలు ఈ సోంపు గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోంపు గింజలను చాలా మంది భోజనం చేసిన తరువాత తినే తీపి పదార్థంగానే భావిస్తారు. కానీ సోంపు గింజలు తినడం వల్ల మనం తిన్న ఆహారం సకాలంలో జీర్ణమవుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.
భోజనం చేసిన తరువాత ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను తినడం వల్ల నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది. ఈ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ గింజలను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటిలో అధికంగా ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ను పెంచడంలో ఉపయోగపడుతుంది.