మన ఇంటి పరిసర ప్రాంతాలలో కనిపించే పువ్వులలో మందార పువ్వులు ఒకటి. ఈ పువ్వులు అనేక రకాలలో కనిపిస్తుంటాయి.మందార పువ్వులను పూజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు..
మందార పువ్వులు మన జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి . మందార పువ్వులుజుట్టుకు కొన్ని అద్భుతమైన పనులు చేయగలవని మీకు తెలుసా?
మందారం పువ్వులు మరియు ఆకులు జుట్టు పెరుగుదలకు, దృఢంగా ఉండేందుకు ప్రోత్సహిస్తాయి.మరియు జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
ఎండబెట్టిన పువ్వుల నుండి తయారైన పొడి జుట్టు చివరలను చిట్లి పోకుండా, చుండ్రును నివారిస్తుంది.జుట్టు నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది.
అలాగే పచ్చి మందార పువ్వులను జుట్టు రాలిన చోట క్రమం తప్పకుండా రాయడం వలన జుట్టు పెరుగుతుంది
మందార నూనెను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు . మందార పువ్వులు కొందరికి అందుబాటులో ఉండవు . అటువంటి వారు మందార నూనెను తయారు చేసుకుని వాడుకోవచ్చు . అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలిసిన పదార్ధాలు :
మందార పువ్వులు – 10-15
కరివేపాకు రెమ్మలు-10
కొబ్బరి నూనె -1/4 కేజీ
ముందుగా కొబ్బరి నూనెను ఒక గిన్నెలో పోసి కొద్దిగా వేడి కాగానే మందార పువ్వులను ,కరివేపాకులను కలిపి ఒక 10 నిముషాలు వేడిచేయాలి. ఆ తరువాత స్టవ్ ఆపివేసి, నూనె చల్ల బడిన తరువాత నూనెను వడకట్టాలి . ఈ నూనెను ఒక బాటిల్ లోకి తీసుకోవాలి .
ఈ నూనెను మీరు తలస్నానం చేసే ముందు రాసుకుని ఒక 30 నిముషాల తరువాత తల స్నానం చేయాలి.లేదా ఈ నూనెను మీరు రోజు తలకు రాసుకోవచ్చు .