వేసవికాలం వచ్చిందంటే అందరు చల్లగా ఉండే వస్తువులను ఎక్కువగా తినడం జరుగుతుంది. మనకు వేసవి కాలంలో ఎక్కువ దాహం అనిపిస్తుంది . ఈ దాహం తీరడానికి చల్లటి పానీయాలు, జ్యూస్, సలాడ్ ఇలా వివిధ రకాలుగా ఆహరం తీసుకుంటాం.
కొంతమంది చల్లటి నీరు కాలంతో సంబంధం లేకుండా రోజు తీసుకుంటారు. చల్లటి నీరు అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని(problems with cool water) నిపుణులు చెబుతున్నారు.
- కూల్ వాటర్ తాగడం వలన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.
- జీర్ణ వ్యవస్థ దెబ్బ తిని , జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- ఆహారం తీసుకున్న వెంటనే చల్లటి నీరు తాగితే కొవ్వు గడ్డలుగా తయారవుతుంది .
- డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది.
- కూల్ వాటర్ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి