ఆరోగ్యానికి పండ్లు , కూరగాయలు ఎంత మేలు చేస్తాయో మొలకలకు(Sprouts)కూడా అంత ప్రాధాన్యత ఉంది. మనం సాధారణంగా తీసుకునే మొలకలలో పెసలు, శనగలు , వేరుశనగ, సజ్జలు ముఖ్యమైనవి.
మొలకల్లో అనేక పోషకాలు లభిస్తాయి. భిన్న రకాల గింజలతో మొలకలను చేసుకుని తింటే మంచిది. దీంతో అనేక పోషకాలను పొందవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫోలేట్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్ లు సి,కె వంటివి మనకు మొలకల ద్వారా లభిస్తాయి. ఇవి శరీరానికి పోషణను, శక్తిని అందిస్తాయి.
మొలకలలో మొదట గుర్తు వచ్చేవి పెసలు. మిగిలిన వాటితో పోలిస్తే పెసలు త్వరగా మొలకలు వస్తాయి.పెసలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
- శరీరానికి వేడిమి రాకుండా ఉండేదుకు ఉపయోగపడతాయి.
- చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడతాయి .
- గుండె కంటి జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది.
- వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతలను నిర్మూలిస్తుంది.
- బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
- డయాబెటిస్‌తో బాధపడేవారు మొలకలను తింటే ప్రయోజనం కలుగుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.