మనం రోజు తీసుకునే కూరగాయలలో బీరకాయ ఒకటి . బీరకాయలు పాకుడు జాతికి చెందిన మొక్క .బీరకాయను ఆహరం లో చేర్చుకునేవారు చాల తక్కువ అనే చెప్పాలి . బీరకాయలో ఉన్న గుణాలు తెలుసుంటే ఇంక మీరు బీరకాయను మీ డైట్ లో చేర్చుకోక మానరు .బీరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది.
బీరకాయ వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం(Health benefits of Ridge Gourd):
బీరకాయలో ఉండే పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వారానికి రెండు సార్లు బీరకాయ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు బీరకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ విటమిన్లు, ఖనిజాలు, థయమిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి
బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి . తద్వారా బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం. బరువు తగ్గాలి అనుకునేవారు బీరకాయను వారంలో రెండు సార్లు తీసుకుంటే మంచిది.
బీరకాయ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు నిత్యం బీరకాయను ఉపయోగించడం ఎంతో మేలు చేస్తుంది.
బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్, ఆల్క్‌లైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మహిళలు సరియైన పోషకాహారం తీసుకోకపోవడం వలన రక్తహీనతతో బాధపడుతుంటారు. ఐరన్ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల పెంపుదలలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది.బీరకాయను నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు .