భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తృణధాన్యాల్లో రాగులు ఒకటి. రాగులను మన పూర్వీకులు సంకటిగా చేసుకుని తినేవారు.రాగుల పిండి (finger millet powder) జావ చేసుకుని తీసుకునేవారు.జొన్నలు, కోరలుతో చేసిన ఆహరం తీసుకోవడం వలన వారు ఆరోగ్యంగా ఉండేవారు. ఆహారంపట్ల శ్రద్ధ వహించే వారు ప్రస్తుతం రాగులను ఆహారంలో చేర్చడం జరిగింది.
రాగులను తినలేని వారు వాటిని పిండిగా చేసుకుని ఆ పిండితో గంజి, రాగి రొట్టె మరియు మనం నిత్యం తయారు చేసుకునే అల్పాహారాలైన ఇడ్లీ, దోసె పిండిలో కలిపి తీసుకుంటారు.
రాగులు తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు(Health benefits of ragi malt) :
రాగుల్లో ఇతర తృణధాన్యాలలో కంటే అధిక ఖనిజాలు ఉన్నాయి.శాకాహారులకు అవసరమైన ప్రోటీన్ అందించే మూలంమాత్రం రాగులే.
రాగిలో అత్యధిక పొటాషియం మరియు కాల్షియం ఉన్నాయి తద్వారా ఎముకలు ,దంతాలు దృడంగా మారతాయి.
రాగుల్లో ఇనుము అధికంగా ఉండడం మూలంగా రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదపడుతుంది.హిమోగ్లోబిన్ యొక్క స్థాయి తక్కువ కలిగిన వ్యక్తులకు రాగి ఒక ముఖ్యమైన తరుణోపాయమవుతుంది.
రాగులు తక్కువ కొవ్వు పదార్థాల్నికలిగి ఉండటం వలన బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి .
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది
షుగర్ ని అదుపులో ఉంచుతుంది .
గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.