ధాన్యపు గింజల్లో రాగులు (Finger Millet) కూడా ముఖ్యమైనవి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటమే. రాగి సంగటి ఆరగించడం లేదా రాగి అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రాగులతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. (Health Benefits of Ragi Java in Telugu).
ధాన్యపు గింజలైన రాగుల్లో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాగులతో (Finger Millet) తయారు చేసే అంబలిని తాగడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా బరువు తగ్గుతారు. ఇంకా చాలా లాభాలే ఉన్నాయి.
రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు రాగి అంబలి ద్వారా అందుతాయి. రాగి అంబలికి చలువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించుకోవచ్చు. (Health benefits of Finger Millet).
ఒక గ్లాస్ రాగి అంబలి (Ragi Java) తాగినా చాలా సేపు ఆకలి వేయదు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం ఎక్కువగా తినాలనిపించదు. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూలకాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బరువు తగ్గవచ్చు.