రావి ఆకులతో ఎన్నో రోగాలు నయం అవుథాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పిల్లలు లేని వాళ్ళకు ఈ చెట్టు దివ్య ఔషదం అని అంటున్నారు.ఇటువంటి సమస్యల నుంచి బయట చెప్పుకోలేని పరిస్థితి.ఇలాంటి వారి కోసం రావిచెట్టు ఆకులు అద్బుతమైన ఫలితాన్ని ఇస్తాయి.
కొన్నేళ్లకు ముందు చిన్నారులకు మాటలు సరిగా రాకపోతే రావి చిగురు ఆకును కూడా తినిపించేవారు. అంతేకాదు పాము కాటు, ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు వంటి అనేక సమస్యలు రావి చెట్టు వల్ల తగ్గిపోతుంది.
రావి ఆకుల కాషాయం తాగడం వలన వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఆడవారికి నెలసరి సమస్యలను దూరం చేస్తుంది. రావి చెట్టు బెరడు , దాని పండిన పండ్లు ఉబ్బసం చికిత్సకు సహాయపడతాయి. రావి చెట్టు యొక్క పండిన పండ్లను తినడంతో ఆకలిని కలిగిస్తాయి.
రావి పండ్లు తినడంతో కడుపులో మంట తగ్గుతుంది. ఇకపోతే ఈ ఆకులను మరిగించి తాగడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుంది.. పంటి నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.అలాగే లైంగిక సమస్యలు కూడా రావి ఆకుల వల్ల దూరం అవుతాయి.