Jack Fruit : పనస పండు చూడటానికి అదో రకంగా ఉన్నా కూడా అందులో ఉండే పండ్లను తినడం వల్ల ఎన్నో పొషక విలువలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో మనం తెలుసుకుందాం.
వీటిలో ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషులకు వీర్య కణాల పెరుగుదలకు ఇవి సహాయపడతాయి. దాంతో శృంగారంలో మరింత ఆనందం పొందుతారు.
పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.హైబీపీ ఉన్న వారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే హైబీపీ తగ్గుతుంది. పనస పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తాయి.
ఫైబర్, విటమిన్ ఎ, సి, రైబోఫ్లేవిన్, మెగ్నిషియం, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పనస పండ్లలో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవాళ్ళు మాత్రం వీటిని డైట్ లో చేర్చుకొవచ్చు. గుండె జబ్బులను తగ్గిస్తుంది. అందుకే ఎటువంటి వారైనా కూడా వీటిని తినవచ్చు.