Ivy Gourd: మనం ప్రతిరోజు వాడుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి . ఇది వేసవికాలం మినహా అన్ని కాలాల్లో |లభిస్తుంది . దొండకాయలలో బీటా కెరోటిన్, ప్రోటీన్లు ,విటమిన్లు ,ఖనిజాలు,పీచు మరియు ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి . ఈ కాయ డయాబెటిస్ ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దొండకాయ (Ivy gourd for diabetes) రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది.
దొండకాయ మతిమరుపును తగ్గించడంలో ఈ కాయ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వంశపారం పరంగా వచ్చే వ్యాధులను నియంత్రిస్తుంది.
ఈ కాయలు రీబో ప్లేవిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనసుకు హాయిని కలిగించి డిప్రెషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
దొండకాయ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కాళ్లు , చేతులు తిమ్మిర్లు తగ్గుతాయి.ఇందులో పీచు పదార్ధం ఉండటం వలన తీసుకునే ఆహరం సులభంగా జీర్ణం అవుతుంది.
దొండకాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి దీనివల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు దగ్గు వంటి వ్యాధులకు గురికాకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే కాల్షియం మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
దొండకాయలో (విటమిన్ బి 2) రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటుంది . దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.