అన్ని కాలాల్లో దొరికే పండ్లలో జామ ఒకటి.. ఇతర పండ్లతో పోలిస్తే జామ పండు తక్కువ ధరకు లభిస్తుంది. జామ పండుని పేదవాడి యాపిల్ అని కూడా అంటారు .జామ పండులో ఉండే విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఏ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇక జామ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రెట్టింపు లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? అవేంటంటే..
జామ పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది . దీంతో తరచూ జబ్బుల బారిన పడకుండా మంచి ఔషధంలా పనిచేస్తుంది.
జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తక్కువ క్యాలరీలతో అవసరమైన విటమిన్‌లు అందుతాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి జామ పండు ఒక దివ్యౌషధం అనే చెప్పాలి . కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు రోజు తీసుకునే ఆహరంలో ఒక భాగంగా జామను తీసుకోవాలి.
ఫైబర్ పుష్కలంగా ఉండే జామ పండ్లను తీసుకోవడం ద్వారా జీర్ణ క్రియ రేటు మెరుగువతోంది. విరేచనాలకు జామ చెక్ పెడుతుంది.
కొంతమంది స్త్రీలు నెలసరి సమయంలో తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు జామ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
జామపండులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి చూపు క్షీణతను నివారించడమే కాకుండా, కంటి శుక్లం వంటి సమస్యలను దరిచేరనివ్వదు.
జామ పండు లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అది గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది .జామలో ఉండే పోషకాలు యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా ఉపయోగపడుతాయి. జామ పండ్లలోని లైకోపీన్ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. అలాగే రొమ్ము క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది.
డయాబెటిక్ రోగులకు జామ పండ్లు దివ్యౌషధంగా ఉపయోగపడుతాయి. జామలో పుష్కలంగా ఉండే ఫైబర్ తక్కువగా ఉండే గ్లైసెమిక్ కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.
జామలోని యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాలకు రక్షణ ఇస్తుంది.నోటి దుర్వాసన తో భాధపడేవారు జామపండుని తినడం వలన మంచి ఫలితం లభిస్తుంది.పంటి నొప్పులు, నోటి అల్సర్లకు జామ ఆకులతో తయారు చేసిన టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది.
సూచన : ఇక్కడ తెలిపిన వివరాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించాము.