ఉదయాన్నే మెదడు ఉత్తేజం కొరకు , సాయంత్రం సేద తీరడానికి తీసుకునే పానీయం టీ. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల టీ లు అందుబాటులో ఉన్నా గ్రీన్ టీ ( Green Tea) కి ప్రత్యేక స్థానం ఉంది. గ్రీన్ టీ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.(health benefits of Green Tea)
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది.
- రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది.
- దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింప చేస్తాయి.
- గ్రీన్ టీ లో ఉండే పాలీ ఫెనాల్స్ ముడతలు రాకుండా చేసి కొలాజెన్ వయస్సు మీద పడకుండా చేస్తాయి.
- హైబీపీకి కారణమయ్యే హార్మోన్‌ని గ్రీన్ టీ అణిచి వేస్తుంది.
- గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి.
- గ్రీన్ టీ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.
గ్రీన్ టీ తయారీ విధానం
1 .నీటిని మరిగించి టీ పాట్‌లో పోయండి.
2. ఇందులో గ్రీన్ టీ ఆకులు కానీ, గ్రీన్ టీ బ్యాగ్ కానీ వేయండి.
3. రెండు, మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచేయండి. ఇప్పుడే మీకు కావాలనుకుంటే ఏవైనా ఫ్రెష్ హెర్బ్స్ కూడా కలుపుకోవచ్చు, వాటి వల్ల మరి కాస్తా రుచి పెరుగుతుంది.
4. ఇప్పుడు మీ కప్పుల్లో టీ పోసిన తరువాత కొద్దిగా నిమ్మ రసం కానీ తేనె కానీ మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోండి.