గోంగూరను తీసుకోవడం వల్ల కలిగే లాభాలెంటో తెలుసా..?

Gongura

మనం తరుచుగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. తెలుగు వారు ముద్దుగా ఆంధ్రమాత అని పిలుస్తుంటారు . మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే  గోంగూర రుచి వేరు . పులుపు ఇష్టపడే వారు గోంగూరను ఎక్కువగా తీసుకుంటారు. గోంగూరను పచ్చడి గా , నిల్వ పచ్చడిలా కూడా వాడుతుంటారు.వారానికి ఒక్కసారైనా గోంగూరను  తీసుకోవడం (Health Benefits of Gongura/ Sorrel Leaves)వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.

గోంగూర లో ఐరన్(Iron) ఎక్కువగా ఉంటుందని మనకి తెలుసు. గోంగూరలోని పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది.

గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉండదు. ఎముక‌లు కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గుండె, మూత్ర‌పిండాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో కూడా గోంగూర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

దీనిలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తోపాటు సి విటమిన్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి.

విటమిన్ ఎ వల్ల కంటి సంబంధిత  సమస్యలు తొలగిపోతాయి. బి కాంప్లెక్స్‌, సి విటమిన్ల‌తో దంత సమస్యలు దూరంగా ఉంటాయి.

అలాగే ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి.ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది .

 

Exit mobile version