HomeHealthఅల్లంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా . Health benefits of Ginger

అల్లంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా . Health benefits of Ginger

సాధారణంగా వంటకాలలో మసాలాలు తయారుచేసేటప్పుడు అల్లం ను తప్పకుండా ఉపయోగిస్తారు.  అల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి (Allam /Ginger Health Benefits in Telugu).

అల్లంలోని కొన్ని రసాయన సమ్మేళనాలు శరీరాన్ని సూక్ష్మక్రిముల నుండి నిరోధించడంలో సహాయపడతాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Health benefits of Ginger

అల్లంలోని జింజెరోల్స్ అనే యాక్టివ్ కాంపౌండ్స్ నోటి బ్యాక్టీరియాను పెరగకుండా చేస్తుంది. మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.అల్లం యొక్క యాంటీ బాక్టీరియల్ శక్తి మీ చిరునవ్వును కూడా ప్రకాశవంతం చేస్తుంది.

దగ్గు జలుబుతో బాధపడేవారు కొంచెం అల్లం తీసుకోవడంవలన ఉపశమనం లభిస్తుంది.

ఋతుక్రమం సమయంలో కొంతమంది ఆడవారు కడుపునొప్పితో బాధపడుతుంటారు.పీరియడ్ పెయిన్స్ ను నియంత్రిచడంలో అల్లం ఉపయోగపడుతుంది.

చాలా మందికి వికారం వాంతులు వంటి సమస్యలు, ప్రయాణాలు చేసినప్పుడు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఉదయాన్నే ఈ సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనపడతాయి. అలాంటి వారు ప్రతిరోజు అల్లం తీసుకోవడం వల్ల అలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

  • ఉదయం పరగడుపున (ఖాళీ కడుపుతో) అల్లం తీసుకోవడం వలన మీ బరువును తగ్గించుకోవచ్చు.
  • ఉదయం పూట అల్లం తింటే మధుమేహం సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
  • అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వలన క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది.
  • ఆర్థరైటిస్ లక్షణాలను సులభతరం చేస్తుంది.
  • అల్లం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
  • పురుషులు మరియు స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

అల్లం ను  రోజువారీ చిన్న  మోతాదు తీసుకోవడంవలన  “చెడు” లేదా LDL కొలెస్ట్రాల్  లెవెల్ ను తగ్గిస్తుంది. ఇటీవలి అధ్యయనంలో, 3 నెలల పాటు రోజుకు 5 గ్రాముల అల్లం తీసుకోవడం వల్ల ప్రజలలో LDL కొలెస్ట్రాల్ సగటున 30 పాయింట్లు తగ్గింది.

 

 

 

.

 

See also  Aloe Vera for Gas Trouble : ప్రతి రోజు దీనిని తీసుకుంటే గ్యాస్ కి చెక్ పెట్టొచ్చు
RELATED ARTICLES

Most Popular

Recent Comments