HomeBeauty TipsFenugreek Seeds :మెంతుల కషాయంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం

Fenugreek Seeds :మెంతుల కషాయంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం

Menthulu Upayogalu : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంట ఇంటి దినుసుల్లో ఒక‌టిగా ఉపయోగిస్తున్నారు. మెంతుల‌ను చాలా మంది కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే మెంతుల వల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌తో త‌యారు చేసుకునే నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

fenugreek seeds

ఒక పాత్ర‌లో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా మ‌రిగించాలి. మెంతుల రంగు పూర్తిగా మారి నీరు ఆ రంగులోకి వ‌చ్చాక ఆ మిశ్ర‌మాన్ని సేక‌రించి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

మెంతుల‌తో త‌యారు చేసుకునే ఆ నీటిని సేవించ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇలా తాగితే ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది.

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మెంతులు దివ్య ఔష‌ధం. క‌నుక వారు ఈ నీటిని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులోకి తేవ‌చ్చు. దీంతో డ‌యాబెటిస్ బాధించ‌దు.

గుండె, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా.. ఆయా వ్యాధులు ఉన్న‌వారు వాటి నుంచి బ‌య‌ట ప‌డాల‌న్నా.. మెంతుల నీటిని వారంలో క‌నీసం 3 నుంచి 4 సార్లు అయినా తాగాల్సి ఉంటుంది.

గుండె, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా.. ఆయా వ్యాధులు ఉన్న‌వారు వాటి నుంచి బ‌య‌ట ప‌డాల‌న్నా.. మెంతుల నీటిని వారంలో క‌నీసం 3 నుంచి 4 సార్లు అయినా తాగాల్సి ఉంటుంది.

ఇది జుట్టు రాలడం, నెరిసిన జుట్టు, యూరిక్ యాసిడ్ స్థాయిలను (gout) తగ్గిస్తుంది. ఇది బ్లడ్ లెవెల్స్ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి (డిటాక్సిఫై) కూడా సహాయపడుతుంది.

న్యూరల్జియా(నరాలవ్యాధి), పక్షవాతం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించడంలో మెంతి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాలి కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి, శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిని నయం చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి.

ఇది దగ్గు, ఉబ్బసం, బ్రోన్కైటిస్(bronchitis), ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, ఊబకాయం వంటి కఫ (Kapha) వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మెంతిని ఎవరు, ఎలాంటి సమయంలో తినకూడదు?

ముక్కు సంబంధిత రక్తస్రావ వ్యాధులతో బాధపడుతున్న వారు మెంతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. హెవీ పీరియడ్స్ వంటి రక్తస్రావ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా దీనిని వాడకూడదు. ఇటువంటి రుగ్మతలతో బాధపడేవారు ముఖ్యంగా ఎండాకాలంలో మెంతులను తినకూడదు. మెంతులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి తద్వారా కఫా, వాతాన్ని సమతుల్యం చేస్తాయి.

See also  Ajwain Seeds : రోగ నిరోధక శక్తిని పెంచే వాము సూప్

మెంతి ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి?

1-2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలు రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే తినండి. లేదా టీ లాగా కూడా తాగొచ్చు.

భోజనానికి ముందు లేదా రాత్రిపూట గోరువెచ్చని పాలు లేదా నీటితో ఒక స్పూన్ మెంతి పొడిని రోజుకి రెండుసార్లు తీసుకోండి.

మెంతులను పేస్ట్ లా చేసి.. అందులో పెరుగు/కలబంద జెల్/నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలు మటుమాయమవుతాయి.

రోజ్‌వాటర్‌తో తయారు చేసిన మెంతికూర పేస్ట్‌ని ముఖంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల డార్క్ సర్కిల్స్, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. అయితే, వీటిని ఫాలో అయ్యే ముందుప్రతి ఒక్కరు కూడా తమ ఆయుర్వేదిక్ డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments