ఎగ్ వైట్ (తెల్ల సొన )వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Egg white

రోజుకో గుడ్డు తింటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అంటుంటారు. గుడ్డు అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుడ్డు ఎంతో దోహదపడుతుంది.

గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటిన్లు,  అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉన్నాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది.

కోడిగుడ్డులోని తెల్లసొన వలన కకలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits of EGG White):

తెల్లసొనలో కొలెస్ట్రాల్  తక్కువగా ఉండటంవలన గుండెకు చాలా మంచిది. తెల్లసొనలో పుష్కలమైన అల్బుమిన్ ఉంది’ఇది ప్రోటీన్స్ కు అద్భుతమైన మూలం.ఇది కండరాలను బలోపేతం చేస్తుంది.

తెల్లసొనలో కాల్షియం అధికంగా ఉంటుంది.ఇది మీ ఎముకలను పటిష్ఠం చేస్తుంది.మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది.

పురుషులలో టెస్టోస్టీరాన్ హార్మోన్ (Testosterone Hormone)   ఉత్పత్తికి తెల్లసొన అద్భుతంగా సహాయపడుతుంది .పురుషులు ఎగ్ వైట్ ఎక్కువగా తీసుకోవడం మంచిది.

గుడ్డులోని ఐరన్‌ (Iron)ను  శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

గుడ్డులో విటమిన్ ఎ (Vitamin A) ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది.

Exit mobile version