HomeHealthCustard Apple : సీజనల్ ఫ్రూట్ సీతాఫలంతో ఆరోగ్యానికి కలిగే లాభాలెన్నో

Custard Apple : సీజనల్ ఫ్రూట్ సీతాఫలంతో ఆరోగ్యానికి కలిగే లాభాలెన్నో

Custard Apple: పండ్లలో సీతాఫలం రుచికి మరి ఏ పండు సాటి రాదు అంటే అతిశయోక్తి కాదు.. ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ లో సీతాఫలం పండ్లు విరివిరిగా లభిస్తాయి.. ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ పండ్లు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

సీతాఫలం ఆకులు (Custard Apple Leaves) కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది..!! ఈ ఆకులతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

Custard Apple: సీతాఫలం ఆకులతో డయాబెటిస్ కు చెక్..!!

ప్రతి 10 మందిలో 7 మంది డయాబెటిస్ (Diabetes) తో బాధపడుతున్నారు.. ఇది చాప కింద నీరులా చేరుతుంది. మధుమేహం తగ్గించడానికి సీతాఫలం ఆకులు అద్భుతంగా సహాయపడతాయి. 4 సీతాఫలం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఉదయం పరగడుపున గోరు వెచ్చగా ఈ నీటిని తాగాలి.

ప్రతి రోజు పరగడుపున ఈ నీటిని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. మధుమేహన్ని అదుపులో ఉంచుతుంది.

Custard Apple

ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఏజెనింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. చర్మం ముడతలు (Wrinkles) పడకుండా చేస్తుంది. సూర్యుడు నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఈ కషాయాన్ని తాగితే అన్ని రకాల చర్మ సమస్యలను (Skin Problems) తగ్గిస్తుంది. గజ్జి, తామర, దురద ఉన్న వారు ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అంతే కాకుండా కాలిన గాయాలు (Burns) , పుండ్లు ఉన్న చోట ఈ ఆకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి.

సీతాఫలం ఆకులలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె (Heart)  ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ చెట్టు ఆకులతో తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతి రోజు తాగితే గుండె పోటు (Heart Attack) రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఈ ఆకుల కషాయాన్ని తాగితే రోగ నిరోధక శక్తి ( Immunity) ని పెంచుతుంది. శరీరం ఇన్ఫెక్షన్, వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. హనికర బ్యాక్టీరియా దేహం లోకి ప్రవేశించకుండా చూస్తుంది.

See also  Spices : పసుపు, అల్లం, ధనియాలు, మెంతులు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు
RELATED ARTICLES

Most Popular

Recent Comments