బ్రాసికా ఒలేరేసియా జాతికి చెందిన అనేక కూరగాయలలో క్యాలీఫ్లవర్ ఒకటి. క్యాలీఫ్లవర్ లో పోషకాలకు కొదవే ఉండదు.క్యాలీఫ్లవర్ వండేటప్పుడు వచ్చే వాసన కొంతమందికి నచ్చదు అందువలన తినటానికి ఆసక్తి చూపరు . అయితే వాటిల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం తప్పనిసరిగా తినటానికి ప్రయత్నం చేస్తారు. క్యాలీఫ్లవర్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
క్యాలీఫ్లవర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తాగ్గాలి అనుకునే వారు రెగ్యులర్ డైట్ లో క్యాలీఫ్లవర్ ను చేర్చుకోవడం వల్ల తగ్గడానికి సహాయపడుతుంది.
క్యాలీఫ్లవర్ లో పీచు శాతంతో పాటు నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున ఇది తీసుకోవడంవలన ఆహరం త్వరగా జీర్ణం అవుతుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రక్తంలో షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకునేందుకు క్యాలిఫ్లవర్ ఉపయోగపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు వారంలో ఒక్క రోజైనా తీసుకోవాలి.
కాలీఫ్లవర్ కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది.
క్యాలీఫ్లవర్ లో ఉండే కాల్షియం (Calcium) ఎముకల దృఢత్వానికీ సహాయపడుతుంది.
తరచూ క్యాలీఫ్లవర్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్ల నుండి బయట పడవచ్చు.
హృద్రోగాల బారిన పడకుండా రక్షించడంలో క్యాలీఫ్లవర్ తోడ్పడుతుంది