మనం కూరగాయలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వంకాయ ఒకటి. వంకాయను వివిధ రకాలుగా వంటల్లో ఉపయోగిస్తారు. కొందరు వంకాయ తినడానికి అయిష్టత చూపిస్తారు. వంకాయ వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు తప్పకుండా వంకాయ తీసుకోవడం ప్రారంభిస్తారు.
వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Brinjal)
- వంకాయ యొక్క పైన తోలు భాగం కిడ్నీలోని ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది.
- ఈ కాయ లోపల ఉన్న కండ డయాబెటిస్ సమస్యను సాల్వ్ చేస్తుంది. ఇందులోని విత్తనాలు క్యాన్సర్ కి చాలా మంచిది.
- పాదాల కిందన ఆనుల వచ్చినట్లయితే వీటిని తింటే తగ్గిపోతుంది.
- వంకాయ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
- జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
- రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది .
- అధిక రక్తపోటు ను తగ్గిస్తుంది.
- నరాల బలహీనతను నివారిస్తుంది.
- వంకాయలో పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- వంకాయ చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.