చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ కటీరా (Badam Katora) అని కూడా అంటారు.
ఆయుర్వేద నిపుణులు సైతం దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. గోంధ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
(Katora in Summer )ఎండాకాలంలో, వడదెబ్బ బాగా తగులుతూ ఉంటుంది. ఒంట్లో విపరీతమైన వేడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. బాదం జిగురుని తీసుకుంటే, కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను ఇది బాగా తగ్గిస్తుంది. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు బాదం జిగురు తో దూరం అవుతాయి. బాదం జిగురు ని తీసుకుంటే, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
(Katora For Pregnant Ladies) డెలివరీ తర్వాత చాలామంది తల్లులు, సామర్థ్యాన్ని పొందాలని అనుకుంటుంటారు. బాదం జిగురుతో తయారు చేసిన లడ్డులు ని తీసుకోవడం వలన, పాల ఉత్పత్తి పెరగడంతో పాటుగా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పలు రకాల సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. బాదం జిగురుతో కేర్ వంటివి కూడా సులభంగా మనం తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు, నిమ్మరసం తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు.
గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముడతలు, మచ్చలు మన దరి చేరకుండా ఉంటాయి. చర్మంపై ఉండే గీతలు కూడా తొలగిపోతాయి. చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గోంధ్ మనకు దోహదపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.
(Katora for Strong Bones )గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే నొప్పులను నివారించడంలో గోంధ్ సమర్థవంతంగా పని చేస్తుంది.
మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, నోటిలో అల్సర్లను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా గోంద్ కటిరా మనకు సహాయపడుతుంది. ఈ కటిరాను నెయ్యిలో వేయించి పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి తీసుకోవాలి. అలాగే జ్యూస్ ల తయారీలో కూడా దీనిని నానబెట్టి వేసుకోవచ్చు. ఈ కటిరాను పొడిగా చేసి లడ్డూల తయారీలో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.