Hanuman Karyasiddi Mantram – కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం

సుందరకాండలో హనుమంతుడు సీతను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి, అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది.

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ |
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయకరో భవ ||

ఈ మంత్రమును సీతాదేవి హనుమంతుడికి చెబుతూ, “హనుమా నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుండి గట్టెక్కించగల సమర్థుడివి నువ్వే. ఇదిగో ఈ మంత్రమును సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు. ఇది నీవల్లనే సాధ్యమవుతుంది” అని చెప్పిందట.

హనుమంతుడు సీతాదేవి చెప్పిన మంత్రాన్ని జపం చేస్తూ దాన్ని సిద్ధి పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగాడని పురాణ కథనం.

సీతమ్మ హనుమంతునితో చెప్పిన మాట ఒక కార్యసిద్ధి మంత్రంగా వ్యాప్తి చెందింది.

సీతమ్మ అనే ఈ మాటను ఎవరైనా పఠిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఇంకా దుఃఖాలు తొలగిపోతాయి.

దీన్ని ప్రతిరోజు 108 సార్లు, 40 రోజుల పాటు చెప్పుకోవడం వల్ల అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి.అన్నివిధాలా విజయం నడిపిస్తుంది.

Exit mobile version