HomeDevotionalHanuman Chalisa in Telugu - హనుమాన్ చాలీసా తెలుగులో

Hanuman Chalisa in Telugu – హనుమాన్ చాలీసా తెలుగులో

హనుమాన్‌ చాలీసా శ్రీ తులసి దాసు రచించారు. తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన తరువాత  హనుమాన్ చాలీసా వ్రాసారని తెలుస్తుంది. హనుమను పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును.

రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.

ఆరోగ్యాన్ని రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా ఏల్నాటి శని, అర్ధాష్టమ శనిగాని, అష్టమశని గాని గోచార వశాత్తు జరుగుతున్నప్పుడు, శని మహర్ధశగానీ, శని వేధలు కానీ కలుగుతున్నప్పుడు హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లు క్రమం తప్పకుండా చదివినట్లైతే శని వలన వచ్చే ఆనారోగ్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయని జ్యోతిష్య పండితులు చెప్పారు.

మృగశిర నక్షత్రం ఆంజనేయ స్వామివారికి అత్యంత ఇష్టమైన నక్షత్రం. ఎందుకంటే మృగశిర నక్షత్రం ఉన్నరోజునే మొదట ఆంజనేయ స్వామివారు సీత అమ్మవారి దర్శనం చేశారని పురాణ కధలు చెపుతున్నాయి.

Hanuman Chalisa in Telugu

హనుమాన్‌ చాలీసా దోహా

శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ

జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

See also  Vinayaka Chavithi : వినాయక చవితి కథ, విశిష్టత

సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా –
జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

See also  Surya Ashtakam in Telugu : అన్ని పనులలో విజయం సాధించటం కోసం శ్రీ సూర్య అష్టకం

జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40

దోహా

పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments