HomeDevotionalGovinda Namalu in Telugu - గోవింద నామాలు

Govinda Namalu in Telugu – గోవింద నామాలు

గోవింద నామాలు ఉదయం లేదా సాయంకాలం స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, ప్రశాంత వాతావరణంలో వీలైనన్నీ సార్లు పఠించినట్లయితే ఏడు కొండల శ్రీ వేంకటేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతుంటారు.

గోవింద నామాలు” వింటే మీ ఆర్థిక సమ్యసలు మాయమవుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సల గోవిందా
భాగవతప్రియ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నిత్యనిర్మల గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తి గోవిందా
గోపీలోలా గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవ ప్రియనే గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

మధుసూదనహరి గోవిందా
మహిమ స్వరూపా గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకట రమణ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

కరుణాసాగర గోవిందా
శరణాగత విదే గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలదా గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతిప్రియ గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

అభయమూర్తి గోవిందా
ఆశ్రిత వరద గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙ్గగదాధర గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

విరజాతీర్థస్థ గోవిందా
విరోధిమర్దన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబర గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
అన్నదాన ప్రియ గోవిందా
అన్నమయ్య వినుత గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఆశ్రితరక్షా గోవిందా
అనంత వినుత గోవిందా
వేదాంత నిలయా గోవిందా
వేంకట రమణ గోవిందా

See also  Tholi Ekadashi : తొలి ఏకాదశి (శయన ఏకాదశి) విశిష్ఠత

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ధర్మ స్థాపక గోవిందా
ధనలక్ష్మీ ప్రియ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
లోక రక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వెంగమాంబ నుత గోవిందా
వేదాచల స్థిత గోవిందా
రామకృష్ణ హరి గోవిందా
రఘుకులనందన గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వసుదేవతనయ గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుకసంస్థుత గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకళ్యాణా గోవిందా
నీరజనాభా గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్పతీ హరి గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

స్వయంప్రకాశా గోవిందా
సర్వకారణా గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశ గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
గరుడాద్రి వాసా గోవిందా
నీలాద్రి నిలయా గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

అంజనాద్రీశ గోవిందా
వృషభాద్రి వాస గోవిందా
తిరుమల వాసా గోవిందా
తులసీ మాలా గోవిందా

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

శేషాద్రినిలయా గోవిందా
శ్రేయోదాయక గోవిందా

శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీవేంకటేశ గోవిందా

సర్వేజనా సుఖినోభవంతు

RELATED ARTICLES

Most Popular

Recent Comments