బుధవారం చదవాల్సిన గణేషుని మంత్రం
ఆది దేవునిగా , గణాలకు అధిపతిగా మనం కొలిచే దైవం గణపతి (వినాయకుడు). హిందువులు నిత్యం కొలిచే దైవం గణపతి . గణపతి దేవునికి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి . గణేశునికి ఇష్టమైన పత్రిక గరిక. గణేశునికి ఇష్టమైన ప్రసాదం బెల్లం.
బుధవారం నాడు గణేషునికి ప్రియమైన గరికను అర్పించి , నైవైద్యంగా బెల్లం సమర్పించాలి. దేవునికి దీపం వెలిగించి ,ఓం గం గణపతయే నమః మంత్రాన్ని 21 సార్లు పఠించాలి .
ఈ విధంగా చేయడం వలన ఆ వినాయకుడు మీ విజ్ఞాలను తొలగించి , శుభాన్ని కలిగిస్తాడు.