ఆకుకూరల వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరలలో పోషకాలు అధికంగా ఉంటాయి. తోటకూర, గోంగూర,పాలకూర తదితర ఆకుకూరలలాగా మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి.మెంతి కూరను చలికాలంలో తప్పనిసరిగా తినాలి.
మెంతులలో పీచు పదార్దాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్-సి, బి1, బి2, కాల్షియం,ఫైబర్ కూడా ఉంటాయి.
మెంతి కూర వలన కలిగే ఉపయోగాలు (Health benefits of fenugreek leaves/Methi)
- స్త్రీలకు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
- స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.
- చలికాలంలో జీర్ణ సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
- మెంతి ఆకులను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
- చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
- మెంతి ఆకులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది.
- మెంతి ఆకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.
- డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో మెంతి ఆకులను తీసుకోవడం వలన షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం