HomeDevotionalSurya Grahanam : సూర్య గ్రహణం సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి

Surya Grahanam : సూర్య గ్రహణం సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి

ఈ ఏడాది దీపావళి పండుగ మరుసటి రోజు అక్టోబర్ 25వ తేదీన మంగళవారం నాడు Surya Grahanam సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమవుతుంది.

దీపావళి Deepavali పండుగకు గ్రహణం రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.40 గంటలకు ప్రారంభమై 6.00 గంటలకు ముగియనుంది. అంటే దాదాపు 1.20 నిమిషాల పాటు గ్రహణం కనిపిస్తుంది.

ఈ సందర్భంగా సూర్యగ్రహణం రోజున ఏయే పనులు చేయాలి? ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహణ సమయంలోచేయవలసినవి :

గ్రహణ సమయంలో సూర్య భగవానుడి నవగ్రహ శాంతి మంత్రం, సూర్యుని ద్వాదశ నామాలు, సూర్య అష్టకం మరియు ఆదిత్య హృదయం పారాయణం చాలా మంచిది. 

Surya Bhagavan

నవగ్రహ శాంతి మంత్రం 

జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

గ్రహణ సమయంలో ఈ మంత్రాలు చదవటం వల్ల సూర్యునికి మనం శక్తిని ఇస్తున్నాము. కనుక గ్రహణం తరువాత సూర్య భగవానుడు మనకు మంచి ఫలితాలను ఇస్తారు.  

గ్రహణం ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు (రవికి) గోధుమలు, ఎర్రని వస్త్రం , (కేతువుకు) రంగురంగుల (చిత్ర వర్ణం) వస్త్రం, ఉలవలు వీటితోపాటు రాగి చెంబు, రవి ప్రతిమ, నాగ పడగ దానం ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. 

ఇది ముఖ్యంగా ఈ రాశుల వారు (మీనం, తులా వృశ్చికం మరియు స్వాతి నక్షత్రం ) చేస్తే చల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

గ్రహణం విడిచిన తరువాత పుణ్యనదుల్లో స్నానమాచరించినా, ఇష్టదైవాన్ని స్మరిస్తూ స్నానమాచరించినా అక్షయ పుణ్యం అంటే ఎన్నటికీ తరగని పుణ్యం లభిస్తుంది.

గర్భిణీ స్త్రీలు శ్రీ గర్భ రక్షాంబికా స్తోత్రం (Garbha Rakshambika Stotram) పఠించాలి. 

క్లిష్టమైన మంత్రాలను పఠించలేనివారు, మంత్రోపదేశం లేనివారు ‘ఓం నమః శివాయ’ అనే శివ పంచాక్షరిని కానీ, ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరిని గానీ పఠించాలి.

ఈ గ్రహణ సమయంలో మౌనాన్ని పాటించడం చాలా మంచిది. గ్రహణం ముగిసిన తరువాత తప్పక స్నానమాచరించాలి.

గ్రహణ సమయంలో చేయకూడనివి:

గ్రహణ సమయంలో సూర్యుని నేరుగా చూసే ప్రయత్నం చేయకూడదు.

ఆ సమయం లో బైటికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. అతినీల లోహిత కిరణాలవలన తీవ్రమైన ఆరోగ్య హాని కలుగుతుంది.

గ్రహణ సమయం లో భోజనం చేయకూడదు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బైటికి రాకూడదు. గర్భస్త శిశువుపై అతి నీలలోహిత కిరణాల వలన  విష ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలి.

ఇది కేవలం హిందూ సంప్రదాయానికి సంబంధించినది కాదు. శాస్త్రీయంగా నిరూపించినది. అశ్రద్ధ చేయరాదు.

గ్రహణ సమయం లో రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థ, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కనుక ఆ సమయం లో ముఖ్యమైన పనులు తలపెట్టరాదు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోరాదు.

See also  Mukkoti Devathalu: ముక్కోటి దేవతలు అంటే ఎవరు?
RELATED ARTICLES

Most Popular

Recent Comments