తెలుగు నెలలో ఏడవ మాసం ఆశ్వయుజం . ఈ మాసంలో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారు.ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
సకల వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలం ఈ మాత . ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి అమ్మవారు దర్శనమిస్తుంది.
గాయత్రీ మాత అంటే జ్ఞానానికి ప్రతీక. కనుక గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ చేసిన ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రి అమ్మవారిని తలచుకున్నా, ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుందని భక్తులు నమ్మకం. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది.
ఈరోజు గాయత్రీ అమ్మవారిని నారింజ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. అదేవిధంగా గాయత్రి దేవి అమ్మవారికి తామరు పువ్వులు అంటే ఎంతో ఇష్టం.ఈ రోజు అమ్మవారికి రవ్వకేసరి (Ravva kesari) లేదా పులిహోరను (pulihora) నైవేద్యంగా సమర్పించాలి.
ఈ రోజు చదవాల్సిన మంత్రం గాయత్రి అష్టోత్తరం(Gayatri ashtothram) . అలా కుదరని పక్షాన .“ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయో యోనః ప్రచోదయాత్!” అనే మంత్రంతో ఆరాధించాలి. అదీ వీలుకాకుంటే..‘ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః’ అన్న మంత్రంతో పూజించాలి.
ఈ విధంగా అమ్మవారిని అలంకరించి పూజలు చేసిన తర్వాత గాయత్రి చాలీసా (Gayathri Chalisa) చదవడం ఎంతో మంచిది.