దసరా నవరాత్రులలో ‘శ్రీ మహాలక్ష్మీ దేవి’ గా అమ్మవారు, మంత్రం, నైవేద్యం

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం 

అంటూ అందరు ఈ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఆరాదిస్తారు. రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ  రూపంలో అమ్మ దర్శనం ఇస్తుంది. అష్ట లక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మీ.

Sri MahaLakshmi Devi

శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ధన ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి రూపాలలో శ్రీ మహాలక్ష్మి ని ఆరాధిస్తారు. మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడ్ని సంహరించింది.

ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయనిపురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది.

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు  ఈ రోజు జపించి ఎరుపు రంగు పుష్పములతో ఈ రోజు అమ్మని శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఆరాధించాలి. ఈరోజు అమ్మ వారికి నైవేద్యంగా శనగపప్పు వడలు బెల్లంతో కూడిన పొంగలి అమ్మకు సమర్పిస్తారు.

Exit mobile version