HomeDevotionalదసరా నవరాత్రులు మొదటి రోజు 'స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ' గా అమ్మవారు

దసరా నవరాత్రులు మొదటి రోజు ‘స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ‘ గా అమ్మవారు


దుర్మగమ్మ అనుగ్రహంతో ఏ ఇంట్లో అయినా సిరుల వర్షం కురుస్తుందని భక్తుల విశ్వాసం. దసరా మొదటి రోజు అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి, ఆమెను స్వర్ణ కవచాలంకృతగా పూజిస్తున్నారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసినా, పూజించినా ఇంట్లో ఉన్నదరిద్రం తీరిపోతుందని భక్తుల విశ్వాసం.

స్వర్ణ కవచాలంకృత దేవి’గా అష్ట భుజాల‌తో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై క‌న‌క‌పు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోయే ఆ త‌ల్లిని ద‌ర్శించుకోవ‌డం నిజంగా భ‌క్తుల‌కు క‌నుల పండగే. ఈ అలంకారంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటే స‌క‌ల ద‌రిద్రాలూ తొల‌గిపోతాయంటారు.

Shree Swarna kavachalankruta Durga Devi

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచంతో (Shree Swarna kavachalankruta Durga Devi) అలంకరిస్తారు. ఈ రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది.

ఈ తల్లి సకల శత్రుబాధలనూ నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలూ లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమన్వితమై ఉంటుంది. అందుకే, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన వల్ల మంత్రశక్తి సిద్ధిస్తుంది. ఈ రోజు అమ్మవారిని పసుపు అక్షతలు, పసుపు పచ్చని పూలతో పూజించాలి. దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం పారాయణం చేయాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు, పొంగలి సమర్పిస్తారు. 

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి (Sri Durga Ashtottara Shatanamavali)

  1. ఓం దుర్గాయై నమః
  2. ఓం శివాయై నమః
  3. ఓం మహాలక్ష్మ్యై నమః
  4. ఓం మహాగౌర్యై నమః
  5. ఓం చండికాయై నమః
  6. ఓం సర్వఙ్ఞాయై నమః
  7. ఓం సర్వాలోకేశ్యై నమః
  8. ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
  9. ఓం సర్వతీర్ధ మయాయై నమః
  10. ఓం పుణ్యాయై నమః ||10||
  11. ఓం దేవ యోనయే నమః
  12. ఓం అయోనిజాయై నమః
  13. ఓం భూమిజాయై నమః
  14. ఓం నిర్గుణాయై నమః
  15. ఓం ఆధారశక్త్యై నమః
  16. ఓం అనీశ్వర్యై నమః
  17. ఓం నిర్గుణాయై నమః
  18. ఓం నిరహంకారాయై నమః
  19. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
  20. ఓం సర్వలోకప్రియాయై నమః ||20||
  21. ఓం వాణ్యై నమః
  22. ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
  23. ఓం పార్వత్యై నమః
  24. ఓం దేవమాత్రే నమః
  25. ఓం వనీశ్యై నమః
  26. ఓం వింధ్య వాసిన్యై నమః
  27. ఓం తేజోవత్యై నమః
  28. ఓం మహామాత్రే నమః
  29. ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
  30. ఓం దేవతాయై నమః ||30||
  31. ఓం వహ్నిరూపాయై నమః
  32. ఓం సతేజసే నమః
  33. ఓం వర్ణరూపిణ్యై నమః
  34. ఓం గుణాశ్రయాయై నమః
  35. ఓం గుణమధ్యాయై నమః
  36. ఓం గుణత్రయవివర్జితాయై నమః
  37. ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
  38. ఓం కాంతాయై నమః
  39. ఓం సర్వసంహార కారిణ్యై నమః
  40. ఓం ధర్మఙ్ఞానాయై నమః ||40||
  41. ఓం ధర్మనిష్టాయై నమః
  42. ఓం సర్వకర్మవివర్జితాయై నమః
  43. ఓం కామాక్ష్యై నమః
  44. ఓం కామాసంహంత్ర్యై నమః
  45. ఓం కామక్రోధ వివర్జితాయై నమః
  46. ఓం శాంకర్యై నమః
  47. ఓం శాంభవ్యై నమః
  48. ఓం శాంతాయై నమః
  49. ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
  50. ఓం సుజయాయై నమః ||50||
  51. ఓం జయాయై నమః
  52. ఓం భూమిష్ఠాయై నమః
  53. ఓం జాహ్నవ్యై నమః
  54. ఓం జనపూజితాయై నమః
  55. ఓం శాస్త్రాయై నమః
  56. ఓం శాస్త్రమయాయై నమః
  57. ఓం నిత్యాయై నమః
  58. ఓం శుభాయై నమః
  59. ఓం చంద్రార్ధమస్తకాయై నమః
  60. ఓం భారత్యై నమః ||60||
  61. ఓం భ్రామర్యై నమః
  62. ఓం కల్పాయై నమః
  63. ఓం కరాళ్యై నమః
  64. ఓం కృష్ణ పింగళాయై నమః
  65. ఓం బ్రాహ్మ్యై నమః
  66. ఓం నారాయణ్యై నమః
  67. ఓం రౌద్ర్యై నమః
  68. ఓం చంద్రామృత పరివృతాయై నమః
  69. ఓం జ్యేష్ఠాయై నమః
  70. ఓం ఇందిరాయై నమః ||70||
  71. ఓం మహామాయాయై నమః
  72. ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః
  73. ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
  74. ఓం కామిన్యై నమః
  75. ఓం కమలాలయాయై నమః
  76. ఓం కాత్యాయన్యై నమః
  77. ఓం కలాతీతాయై నమః
  78. ఓం కాలసంహారకారిణ్యై నమః
  79. ఓం యోగానిష్ఠాయై నమః
  80. ఓం యోగిగమ్యాయై నమః ||80||
  81. ఓం యోగధ్యేయాయై నమః
  82. ఓం తపస్విన్యై నమః
  83. ఓం ఙ్ఞానరూపాయై నమః
  84. ఓం నిరాకారాయై నమః
  85. ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
  86. ఓం భూతాత్మికాయై నమః
  87. ఓం భూతమాత్రే నమః
  88. ఓం భూతేశ్యై నమః
  89. ఓం భూతధారిణ్యై నమః
  90. ఓం స్వధానారీ మధ్యగతాయై నమః ||90||
  91. ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
  92. ఓం మోహితాయై నమః
  93. ఓం అంశుభవాయై నమః
  94. ఓం శుభ్రాయై నమః
  95. ఓం సూక్ష్మాయై నమః
  96. ఓం మాత్రాయై నమః
  97. ఓం నిరాలసాయై నమః
  98. ఓం నిమగ్నాయై నమః
  99. ఓం నీలసంకాశాయై నమః
  100. ఓం నిత్యానందిన్యై నమః ||100||
  101. ఓం హరాయై నమః
  102. ఓం పరాయై నమః
  103. ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
  104. ఓం అనంతాయై నమః
  105. ఓం సత్యాయై నమః
  106. ఓం దుర్లభ రూపిణ్యై నమః
  107. ఓం సరస్వత్యై నమః
  108. ఓం సర్వగతాయై నమః
    ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః || 108 ||
See also  శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః , శ్రీ గాయత్రీ చాలీసా - Sri Gayatri Chalisa , Sri Gayatri Asthottaram

ఇతి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం

శ్రీ దుర్గా కవచం (Sri Durga Kavacham in Telugu)

శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ || 

అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ || 

ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ||

సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా || 

అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ || 

కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ || 

ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments