దసరా సందర్భంగా అమ్మవారిని వేర్వేరు అలంకారాల్లో పూజిస్తారు. ఒక్కో ప్రాంతంలోని ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారాలు చేస్తుంటారు. నవరాత్రి అనే పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రాశస్త్యం ఉంది.
ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది పగళ్ళు , రాత్రులు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే ‘శరన్నవరాత్రులు’ లేదా ‘దేవి నవరాత్రులు అంటారు.
ఆశ్వీయుజ మాసంలో ఎనిమిదివ రోజు అష్టమి రోజును దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంగా పూజిస్తారు. ఈరోజు అమ్మవారి ముందు దుర్గాష్టకమ్, దుర్గా సప్తశతిలాంటి స్తోత్రాల పారాయణ చేయాలి.
ఏవీ కుదరకపోతే ‘ఓం దుం దుర్గాయై నమః’ అనే మూలమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఈరోజు ఎరుపు రంగు చీరను అమ్మవారికి కడతారు. నైవేద్యంగా కదంబం, శాకాన్నం సమర్పిస్తారు.